నాని మరో భారీ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యష్ రాజ్ సంస్థ దక్షిణాదిన చెయ్యబోయే మొదటి చిత్రంలో నాని హీరోగా కనిపించనున్నారు. “బ్యాండ్ బజావో బారాత్” చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేస్తున్నట్టు యష్ రాజ్ సంస్థ ప్రకటించింది. పలు హీరోల పేర్లను పరిశీలించిన మీదట నాని ఖరారు అయ్యారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు, చిత్రం గురించి మరియు చిత్ర బృందం గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. విష్ణువర్ధన్ కి సహాయకుడిగా చేసిన గోకుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం 2013 మొదట్లో ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా నాని ప్రస్తుతం కృష్ణ వంశి “పైసా” చిత్రంలో నటిస్తున్నారు. డిసెంబర్ 14న అయన నటించిన “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రం విడుదల కానుంది.ఈ రెండు కాకుండా సముద్ర ఖని దర్శకత్వంలో రానున్న “జెండా పై కపిరాజు” చిత్రంలో కూడా నాని నటిస్తున్నారు.