అఫీషియల్ – “నాని 28” ఆసక్తికరంగా ఉండేలా ఉందే.!

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పటి వరకు ఎన్నో అద్భుత చిత్రాలను మన తెలుగు ఆడియెన్స్ కు అందించారు. అయితే బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న నాని తన బెంచ్ మార్క్ సినిమా “వి”తో కాస్త నిరాశ పరిచాడు. కానీ మరో ఇద్దరు టాలెంటెడ్ దర్శకులతో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు స్టార్ట్ చేసిన నాని తన 28వ సినిమాను కూడా ప్రకటించేసారు.

అయితే పూర్తి స్థాయిలో కాదు కానీ చిత్ర నిర్మాణ మైత్రి మూవీ మేకర్స్ వారు మొదటి నుంచి టీజ్ చేస్తున్నట్టుగానే ఈరోజు ఆ ప్రాజెక్ట్ ను రివీల్ చేసారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ కు చిత్ర యూనిట్ వెల్కమ్ చెబుతూ అలాగే మళయాళ హీరోయిన్ నజ్రియా ఫహద్ కు కూడా తమ ఫిల్మ్ ఫ్యామిలీ లోకి ఆహ్వానించారు.

అయితే అందుకు సంబంధించిన పోస్టర్ ను చూస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఒక పక్క వీణతో సంగీతాన్ని సూచిస్తూ మరో పక్క ఫ్లైట్స్, కెమెరాలుతో ఫారిన్ టచ్ ఇలా కొన్ని చూపిస్తున్నారు. మొత్తానికి ఇవి అన్ని చూస్తుంటే ఈ నూతన దర్శకునితో నాని మరో కొత్త సినిమా టేకప్ చేసారని అనిపిస్తుంది. ఇక అలాగే ఈ నవంబర్ 21 మరోసారి కలుద్దాం అని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు.

Exit mobile version