జబర్దస్త్ పై పూర్తి నమ్మకంతో ఉన్న నందిని రెడ్డి

డైరెక్టర్ నందిని రెడ్డి తన మొదటి సినిమా ‘అలా మొదలైంది’తో బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అందుకోవడమే కాకుండా తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. తను రెండవ ప్రయత్నంగా సిద్దార్థ్ – సమంత హీరో హీరోయిన్స్ గా తీసిన ‘జబర్దస్త్’ సినిమాపై ఆమె పూర్తి నమ్మకంతో ఉన్నారు. పూర్తి ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్దార్థ్ – సమంతల నటన విషయంలో కూడా ఆమె సంతృప్తిగా ఉంది.

మాస్ టచ్ తో కూడిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమా ఆడియో ఫిబ్రవరి 1న జరగనుంది. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా, బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి చివరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version