‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘భాయ్’ సినిమా ఆడియో సెప్టెంబర్ 12న జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ మూవీలో నాగార్జునకి జోడీగా రిచా గంగోపాధ్యాయ్ కనిపించనుంది. ఈ సినిమా ‘హలో బ్రదర్’ లాగా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. నాగార్జున ఈ సినిమాలో మూడు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘భాయ్’ సినిమాకి వీరభద్రం చౌదరి డైరెక్టర్.