దసరాకు రానున్న నాగార్జున సోషియో ఫాంటసీ మూవీ

దసరాకు రానున్న నాగార్జున సోషియో ఫాంటసీ మూవీ

Published on Aug 6, 2012 11:26 AM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున సరికొత్త అవతారంలో రానున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుఖం’. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ పనుల వల్ల ఆలస్యమవుతోంది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో నాగార్జునని పూర్తి యాక్షన్ తరహా పాత్రలో చూడవచ్చు మరియు ఈ చిత్రంలో మన పురాణానికి సంబందించిన కొన్ని అంశాలను చూపిస్తున్నారు.

ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై డా. వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన అనుష్క కథానాయికగా నటించారు. నాగార్జున కెరీర్లో ఇప్పటివరకూ ఏ చిత్రం తెరకెక్కనంత అత్యంత భారీ వ్యయంతో ‘డమరుఖం’ తెరకెక్కుతోంది.

తాజా వార్తలు