ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించనున్న మాస్ ఎంటర్టైనర్ ‘భాయ్’ షూటింగ్ జనవరి మొదటి వారం నుండి మొదలుకానుంది. వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించనుంది. మాఫియా డాన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నాగ్ పాత్ర మరియు లుక్ కొత్తగా ఉండనుంది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.