
నాగార్జున “డమరుకం” చిత్రం ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూపు ముగియనుంది చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కావలసింది కాని పలు కారణాల మూలాన వాయిదా పడుతూ వచ్చింది. తరువాత ఈ చిత్రం విడుదల మీద ఎవరికీ క్లారిటి లేకుండాపోయింది. కాని అన్ని సమస్యలు తీరిపోయినట్టు తెలుస్తుంది ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే జరుపుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U /A సర్టిఫికేట్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని వెంకట్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగార్జున మరియు అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పరిశ్రమలో సానుకూల స్పందన ఉంది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టుతుందని అంటున్నారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఈ చిత్రం విడుదల అవ్వాలని కోరుకుందాం.