చైతు ‘తండేల్’ టెలివిజన్ ప్రీమియర్ అప్పుడే !

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. అటు ఓటీటీలోనూ ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 29న, 2025న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది.

మొత్తానికి ఈ సినిమాలో మ్యూజిక్‌తో పాటు చైతన్య, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మొత్తమ్మీద ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా, బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ బాగా ఆకట్టుకుంది. పైగా, గుడ్ కంటెంట్ తో పాటు డీసెంట్ టేకింగ్, మేకింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version