చిత్తూరు పరిసర ప్రాంతాల్లో నాగ చైతన్య సినిమా

Nagachithanza
అక్కినేని నాగ చైతన్య – సునీల్ హీరోలుగా రానున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం చిత్తూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా తమిళంలో వచ్చిన ‘వేట్టై’ సినిమాకి రీమేక్. నాగ చైతన్య – సునీల్ అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా – ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ రోజు ఉదయం నాగ చైతన్య శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించుకొని ఆపై రాహు కేతు పూజలు చేసిన తర్వాత షూటింగ్ కి బయలు దేరి వెళ్ళాడు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో పరిచయమైన కిషోర్ కుమార్(డాలీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉండగా సునీల్ హీరోగా నటించిన ‘Mr. పెళ్ళికొడుకు’ సినిమా ఫిబ్రవరి మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్య – శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది, అలాగే దేవకట్టా డైరెక్షన్లో రానున్న ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలో మరో రెండు సాంగ్స్ బాలన్స్ ఉన్నాయి.

Exit mobile version