ఈ సంవత్సరం తమిళంలో లింగుస్వామి డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘వేట్టై’ సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మరియు మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్నారు. ‘100% లవ్’ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. డిసెంబర్ 10 నుంచి వైజాగ్లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్ కోసం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం వైజాగ్ వెళ్లనున్నారు. ఇక్కడ నాగ చైతన్య, తమన్నాలపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో మరో జంటగా సునీల్ – ఆండ్రియా జెరేమియా కనిపించనున్నారు.
ఈ సినిమాలో అన్నదమ్ములైన సునీల్, నాగ చైతన్య అక్కాచెల్లెళ్లు అయిన ఆండ్రియా జెరేమియా, తమన్నాలతో ప్రేమలో పడతారు. కిషోర్ కుమార్(డాలీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని 2013 సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.