‘కింగ్’ అక్కినేని నాగార్జున – రిచా గంగోపాధ్యాయ్ జంటగా మాస్ ఎంటర్టైనర్ అయిన ‘భాయ్’ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయిన ఈ సినిమాలో ఒకే ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. చివరి సాంగ్ నాగ్ – రిచాపై వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్. ఈ పాటని రేపటి నుంచి షూట్ చెయ్యనున్నారు.
వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ సినిమా ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాని సెప్టెంబర్ చివరి వారంలో కానీ లేదా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.