సీడెడ్ ఏరియాలో అదరగొడుతున్న నాయక్

Naayak (8)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘నాయక్’ మాస్ ఏరియాలలో అదిరిపోయే కలెక్షన్స్ తో రన్ అవుతుంది. సీడెడ్ ఏరియాలో లాంగ్ రన్ లో ఈ సినిమా దాదాపు 8కోట్ల మార్కు చేరుకుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఏరియాలో చరణ్ 7 కోట్లు దాటిన మూడవ సినిమా ఇదే. మాస్ ప్రేక్షకులకి సీడెడ్ ఏరియా పెట్టింది పేరు కావడంతో ఈ సినిమాని వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్ నటించిన మరో రెండు సినిమాలు జంజీర్, ఎవడు కూడా ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి. చరణ్ గట్టిగా మాస్ బేస్ పెంచుకుంటూ పోతున్నాడు. జంజీర్ హిందీ, తెలుగు భాషల్లో భారీగా ప్లాన్ చేస్తుండగా ఎవడు సినిమాలో అల్లు అర్జున్ అతిధి పాత్ర చేస్తుండటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

Exit mobile version