నా ఆలోచన అందరికంటే భిన్నంగావుంటుంది : అనుష్క

Anushka
అందాల భామ అనుష్క వరుస హిట్లతో ఈ మధ్య చాలా ఆనందంగా వుంది.’ఢమరుకం’ మరియు ‘మిర్చి’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ఈ భామ ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తుంది. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో రాణిపాత్రలను పోషిస్తున్న ఈ భామ మరింత అందంగా కనిపించడానికి కాస్త సన్నబడింది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ” మనకు చిన్నగా అనిపించిన విషయాలను తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాటిల్లో దాగున్న పెద్ద విషయాలు నాకు సంతృప్తి కలిగిస్తాయి” అని తెలిపింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ అమ్మడు తన చుట్టూ జరిగే పెద్ద విషయాలకన్నా తెలుసుకోవాలని తపనను పెంచే చిన్న విషయాలే ఆసక్తిని కలిగిస్తాయట

ఆమె స్వభావానికి ఒక ఉదాహరణ ఇస్తూ “రోజూ పెరట్లో పెరిగే మొక్క కొత్త చిగుర్లను చూస్తూ వుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అటువంటి చిన్న చిన్న విషయాలలో కలిగే సంతృప్తి అమోఘం” అని తెలిపింది. ఈ విధమైన స్వభావం మన యోగా టీచర్ కు వుందంటే మంచిదే కదూ

Exit mobile version