నా కెరీర్లోనే గొప్పగా చెప్పుకునే పాత్ర అవుతుంది – మంచు లక్ష్మీ

నా కెరీర్లోనే గొప్పగా చెప్పుకునే పాత్ర అవుతుంది – మంచు లక్ష్మీ

Published on Dec 17, 2013 10:00 AM IST

Manchu_Laxmi

మంచు లక్ష్మీ, సీనియర్ నరేష్, ఆమని, చైతన్య కృష్ణ, కృష్ణుడు, కిషోర్, షామిలి, రిచా పనాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘చందమామ కథలు’. గతంలో ‘ఎల్.బి. డబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలను మనకు అందించిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి డైరెక్టర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని త్వరలోనే రిలీజ్ చేసి జనవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఈ చిత్ర టీం తెలియజేసింది.

నిన్న సాయంత్రం ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను చేసిన ఈ పాత్ర నా కెరీర్లోనే గొప్పగా చెప్పుకునే పాత్ర అవుతుందని’ తెలిపింది.

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘నేను సీనియర్ నటీనటులతో చేస్తున్న మొదటి సినిమా ఇది. అందరూ కథ నచ్చి, మెచ్చి చేసిన సినిమా అని’ అన్నాడు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

తాజా వార్తలు