‘పుష్పక విమానం’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ లాంటి ఎన్నో విభిన్న తరహా సినిమాలను మనకందించిన సింగీతం శ్రీనివాసరావు సౌత్ ఇండియాలో బాగా గుర్తిపు తెచ్చుకున్నారు. ఆయన తీసిన కొత్త సినిమా ‘వెల్ కమ్ ఒబామా’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకకి దాసరి నారాయణరావు, అల్లరి నరేష్, అమల అక్కినేని, రోజా, శ్రీను వైట్ల, నందిని రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, ఎంఎం శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ ఇప్పరివరకూ నేను ఎంతోమంది పెద్ద నిర్మాతలతో పనిచేసాను. కానీ మొదటిసారి టీవీ షోలు చేసే వారితో సినిమా చేస్తున్నాను. నేను నాలుగు కథలు చెప్తే వారు ఈ కథని ఎంచుకున్నారు. నటీనటులంతా కొత్తవారైనా బాగా నటించారు. ‘కురుక్షేత్రం’ సినిమాని 3డిలో చెయ్యాలన్నదే నా జీవితాశయం’ అని ఆయన అన్నాడు.
ప్రస్తుతం సింగీతం గారి వయసు 81 సంవత్సరాలు, ఆయన దగ్గర కురుక్షేత్రం సినిమా చేసేంత వయసు లేకపోయినా ఆసక్తి చూపుతున్న ఆయనకి కాస్త బలం, కావాల్సినవి సమకూరిస్తే తన జీవితాశయాన్ని సాధించగలడు.