సంగీత దర్శకుడు చక్రికి పితృ వియోగం


ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి తండ్రి జిల్లా వెంకటనారాయణ నిన్న (గురువారం) ఉదయం 6 గంటలకు మృతి చెందారు. 73 సంవత్సరాల వయస్సు కలిగిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు. నిన్న ఉదయం 6 గంటలకు ఆయన గుండెపోటుతో మృతి చెందారు. చక్రి ఆయనకు మొదటి సంతానం. జిల్లా వెంకటనారాయణ మహబూబాబాదులో ప్రధానోపాధ్యాయుడిగా చాలాకాలం పనిచేసారు. అయన ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రభుత్వం నుండి పురస్కారం కూడా అందుకున్నారు. ధనలక్ష్మి ఐ లవ్ యు, లవ్ ఇన్ హైదరాబాద్ సినిమాల్లో పాటలు కూడా పాడారు. గోపి గోపిక గోదావరి, జై బోలో తెలంగాణా, వీడు తేడా, రంగ ది దొంగ సినిమాల్లో కూడా నటించారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం హాంగ్ కాంగ్ వెళ్ళిన చక్రి తండ్రి మరణ వార్త వినగానే నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

Exit mobile version