‘పెద్ది’: అదిరిన మున్నా భయ్యా బర్త్ డే స్పెషల్ పోస్టర్.. తనపై మరింత క్లారిటీ

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాలో మరింతమంది క్రేజీ స్టార్స్ నటిస్తుండగా వారిలో ఓటిటి సెన్సేషన్ మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా నటుడు దివ్యెందు శర్మ కూడా ఒకరు.

తాను ఈ సినిమాలో సాలిడ్ రోల్ చేస్తుండగా తనపై ఇది వరకే వచ్చిన పోస్టర్ మంచి ఆసక్తి రేకెత్తించింది. ఇక లేటెస్ట్ గా మేకర్స్ నేడు మున్నా భయ్యా బర్త్ డే కానుకగా ఓ స్పెషల్ పోస్టర్ ని మేకర్స్ ఇపుడు విడుదల చేశారు. మరి ఇందులో తాను క్రికెట్ బాల్ పట్టుకొని మంచి మాస్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నాడు.

అలాగే ఈ సినిమాలో తాను రామ్ బుజ్జి అనే పాత్రలో కనిపించనున్నట్టు మేకర్స్ మరో డీటెయిల్ అందించారు. మొత్తానికి ఇప్పుడు తనపై వచ్చిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది. ఇక ఈ భారీ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version