టాలీవుడ్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా రోషన్ కనకాల ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక అతడిని ప్రేమించే అమ్మాయిగా సాక్షి మదోల్కర్ అలరించనుంది. అయితే, వారి లవ్ స్టోరీ అడవి నేపథ్యంలో సాగడం.. ఇందులో రావణుడి లాంటి ఓ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇవ్వడం ఈ టీజర్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. తనకు ఎదురయ్యే సమస్యలను హీరో ఎలా పరిష్కరించాడు అనేది మనకు ఈ సినిమా కథగా చూపెట్టబోతున్నారు.
ఇక పవర్ఫుల్ విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ నటిస్తుండగా హర్ష చెముడు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
