ఇప్పటికే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని సినిమాలు చూడటం తగ్గించిన ప్రేక్షకులకు చేదు వార్త. సినిమా థియేటర్ టికెట్ ధరలు మరోసారి పెరగబోతున్నాయి. సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి ప్రభుత్వాన్ని కలిసి టికెట్ ధర పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరగా ప్రభుత్వం ఈ విషయం పై ఒక కమిటీ వేసింది. గత సంవత్సర కాలం నుండి టికెట్ ధర పెంచాలని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వేసిన కమిటీ టికెట్ ధర పెంచాలా వద్దా, ఒకవేళ పెంచితే ఎంత పెంచాలి అనే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల టికెట్ ధర తప్పనిసరి పెంచాల్సి వస్తోందని ఎగ్జిబిటర్ల వాదన. టికెట్ ధర పెరిగితే సినిమా మళ్లీ మళ్లీ చూసే వారి సంఖ్య తగ్గిపోవడం మాత్రం ఖాయం.