‘రాజు వెడ్స్ రాంబాయి’ మేకర్స్ పై నెటిజన్లు అసంతృప్తి !

అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డలు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. కాగా ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లో రూ. 4 కోట్లకు పైగా వసూలు చేసింది. టికెట్ ధరలు తగ్గించడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై ఇంట్రెస్ట్ చూపించారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ. 99 కాగా, మల్టీప్లెక్స్‌ లో టికెట్ ధరను రూ.105 వరకూ ఉంచారు. మొత్తానికి టికెట్ ధరలను తగ్గించడం బాగా పనిచేసింది.

ఐతే, ధరలను మళ్లీ పెంచిన తర్వాత మూడ్ మారిపోయింది. చాలా మంది ప్రేక్షకులు నిరాశ చెందారు. టికెట్ ధరలను పెంచడంతో చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్ట్ లు పెడుతున్నారు. మళ్లీ టికెట్ ధరలను తగ్గించాలని నిర్మాతలను ప్రేక్షకులు కోరుతున్నారు. ఐతే నిర్మాణ బృందం మాత్రం ఇంకా ఈ అంశం పై స్పందించలేదు. చైతన్య జొన్నలగడ్డ, శివాజీ రాజా మరియు అనిత చౌదరి సహాయక తారాగణం. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ చిత్రాన్ని నిర్మించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

Exit mobile version