మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సత్యదేవ్.!

ఇప్పుడు మన టాలీవుడ్ లో తన టాలెంట్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరో సత్యదేవ్. తన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ తో ఎలాంటి రోల్ ను అయినా అద్భుతంగా ఈ హీరో రక్తి కట్టించగలడు. అందుకే ఇప్పుడు అనేక మంది దర్శక నిర్మాతలకు హాట్ కేక్ లా మారాడు. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టుకున్న సత్య దేవ్ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ సినిమాను తన లైనప్ లో పెట్టుకున్నాడు.

తన కెరీర్ లో “బ్లఫ్ మాస్టర్” అనే చిత్రంతో తన నటనకు మంచి స్కోప్ ఇచ్చిన దర్శకుడు గోపి గణేష్ పట్టాభితో మరో ప్రాజెక్ట్ ను లేటెస్ట్ గా అనౌన్స్ చేసాడు. దీనికి “గాడ్సే” టైటిల్ ను పెట్టి పోస్టర్ ను కూడా విడుదల చెయ్యగా సినీ వర్గాల్లో మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంది. మొత్తానికి మాత్రం సత్యదేవ్ మంచి హ్యాపెనింగ్ హీరోగా మారాడు. మరి తన నటన నుంచి మరిన్ని ఆకర్షణీయమైన సినిమాలు రావాలని కోరుకుందాం.

Exit mobile version