టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ “పవర్ పేట” కూడా ఒకటి. పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఏదొక బజ్ వినిపిస్తూనే ఉంది.
ఈ చిత్రంతో నితిన్ మొట్టమొదటి సారి ప్రయోగం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ చిత్రం సబ్జెక్టు ప్రకారం నితిన్ ఒకే పాత్రలో మొత్తం మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నారు. అందు కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేయనున్నారని తెలిసింది. అయితే ఈ మూడు రోల్స్ పై మరింత క్లారిటీ వస్తుంది.
1960 నుంచి ఇప్పుడు 2020 వరకు మధ్యలో ఉండే పాత్రలో నితిన్ కనిపించనున్నారని. యువకునిగా మధ్య వయస్కునిగా తర్వాత వృద్ధునిగా ఇలా మొత్తం మూడు షేడ్స్ లో నితిన్ ఈ చిత్రంలో కనిపించనున్నారని తెలుస్తుంది. మన టాలీవుడ్ లో ప్రోస్థెటిక్ మేకప్ వేసిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. మరి నితిన్ ఈ ఛాలెంజింగ్ రోల్ ను ఎలా చేస్తారో చూడాలి.