విలక్షణ నటుడు జగపతి బాబు తన కొత్త లుక్ మరియు కెరీర్ పరంగా తీసుకున్న కొన్ని స్టెప్స్ అందరినే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జగపతి బాబు ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నాడు.
జగపతి బాబు ని చూసి ఇండస్ట్రీలోని మరి కొంతమంది హీరోలు కూడా మారాల్సిన టైం, అలాగే అతని దారిలోనే సినిమాలు అంగీకరించాలి. చెప్పాలంటే ఇండస్ట్రీలో మన్చి నటుల కొరత చాలా ఉంది. ఇలా చేస్తే ఆ కొరత తీరిపోయే అవకాశం ఉంది. అలాగే సినిమాలు కాకుండా ఇలాంటి నటులు టెలివిజన్ లో బాగా రాణించడానికి ట్రై చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఫలితం ఎలా ఉన్నా జగపతి బాబు మాత్రం చాలా మందికి స్ఫూర్తినిచ్చాడనే చెప్పాలి.