ఫస్ట్ డోస్ వాక్సిన్ తీసుకున్న మళయాళ లెజెండరీ హీరో.!

గత ఏడాది కరోనా కల్లోలాన్ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ముఖ్యంగా సినీ పరిశ్రమకే భారీ దెబ్బ పడింది. ఆస్తి నష్టంతో పాటుగా పలువురు లెజెండ్స్ ని కూడా ఆ టైం లో మనం కోల్పోయాము. కానీ ఇప్పుడు వాక్సిన్ కనుక్కొని పర్వాలేదు అనిపించే స్థాయిలో అంతా నడుస్తుంది.

పలువురు ప్రముఖులు కూడా తమ వాక్సిన్ ను తీసుకుంటున్నారు.తాజాగా మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న ఎందరో లెజెండరీ హీరోల్లో మళయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ తన మొదటి డోస్ వాక్సిన్ ను వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నారు. అమృత హాస్పిటల్ లో మోహన్ లాల్ తన ఫస్ట్ డోస్ కోవిడ్ వాక్సిన్ ను తీసుకొని బయలుదేరారు.

మరి లేటెస్ట్ గా తాను చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “దృశ్యం 2” అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. మరి దీని తర్వాత మోహన్ లాల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు.

Exit mobile version