సంగీత దర్శకుడు తమన్ కి 2011 బాగా కలిసి వచ్చింది. ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటుగా ‘కందిరీగ’, ‘కాంచన’ వంటి హిట్స్ ఇచ్చిన తమన్ 2012 సంవత్సరం ఆరంభంలో కూడా ‘బిజినెస్ మేన్’ మరియు ‘బాడీ గార్డ్’ వంటి సూపర్ హిట్స్ కూడా ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన ‘నిప్పు’ నిరాశపరిచినప్పటికీ ‘లవ్ ఫెయిల్యూర్’ మాత్రం యువతని ఆకట్టుకుంది. ప్రస్తుతం తమన్ చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. అయితే ఆయన సంగీతం అందించే ఏ సినిమా కూడా సెప్టెంబర్ వరకు విడుదల కావట్లేదు. రామ్ చరణ్, వివి వినాయక కాంబినేషన్లో రానున్న సినిమా సెప్టెంబర్లో ఆడియో విడుదలవుతుంది తమన్ తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు.