తేజ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం నీకు నాకు డాష్ డాష్ చిత్ర టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించక పోవడంతో నిరాశ చెందిన దర్శకుడు చిత్ర రెండవ భాగంలోని కొన్ని సన్నివేశాల్ని తీసేసి ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన మారి కొన్ని సన్నివేశాల్ని కలపనున్నట్లు సమాచారం. చిత్ర టైటిల్ కూడా డాష్ డాష్ తీసేసి నీకు నాకు అని మార్చి మే 4న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ప్రిన్స్, నందిత హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.