రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రానున్న తనీష్

band-baaja-telugu-movie-ope

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మార్క్ తో హిట్ అందుకోవాలని చూస్తున్న యంగ్ హీరో తనీష్ ‘బ్యాండ్ బాజా’ అనే మరో కొత్త సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నగేష్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాని నయీం నిర్మించాడు. విజయ్ కూరాకుల సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే దిల్ రాజు చేతులమీదుగా విడుదలయ్యింది. ఈ చిత్ర డైరెక్టర్ మాట్లాడుతూ ‘ ఈ మూవీ ఫ్యామిలీ అంతా చూడదగిన ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇదే మూవీలో రొమాటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. అటు రూరల్,ఇటు అర్బన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని’ అన్నాడు.

తనీష్ మాట్లాడుతూ ‘ స్క్రీన్ ప్లే, సాంగ్స్, డైలాగ్స్ ఈ సినిమాకి బాగా సెట్ అయ్యాయి. సినిమాకూడా బాగా వచ్చింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో హీరోయిన్ రూపాల్ కి మంచి పేరొస్తుందని’ అన్నాడు. షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version