ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్న తమిళ చిత్ర నిర్మాతల మండలి

తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తమిళ్లో రూపొందే పెద్ద చిత్రాలు పండగలకి మాత్రమే విడుదలని చేయాలనీ నిర్ణయించారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించెందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మండలి చెబుతోంది. పొంగల్, తమిళ కొత్త సంవత్సరం, ఇండిపెండెన్స్ డే, దీపావళి ఈ రోజుల్లో మాత్రమే విడుదల చేసుకోవాలి. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే చిన్న చిత్రాల నిర్మాతలు దీనిపై ఆనదం వ్యక్తం చేస్తున్నారు. కార్తి నటించిన ‘సగుని’ మరియు ధనుష్ నటించిన ‘3’ చిత్రాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీటి విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. తెలుగు చిన్న చిత్రాల నిర్మాతలు కూడా చిన్న సినిమాలను ప్రోత్సహించాట్లేదని అంటున్నారు. చూదం ఈ నిర్ణయం ఎంతవరకు అమలవుతుందో.

Exit mobile version