ఎన్టీఆర్ సినిమా వదులుకున్నందుకు బాధ పడుతున్న శ్రుతి హాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు అయిన శృతి హాసన్ పలు చిత్రాలలో హీరొయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రం ‘దమ్ము’లో’ మొదటగా హీరొయిన్ గా ఆమెనే ఎంపిక చేసుకున్నారు. పలు కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అయితే ఆ చిత్రం చాలా బాగా వస్తున్నట్లు ఆమెకు వార్తలు వస్తుండటంతో మచి అవకాశం వదులుకున్నందుకు ఆమె భాదపడుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మూడు భాషల్లో బిజీగా ఉండి డేట్స్ సరిగా అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ధనుష్ సరసన నటించిన కొలవేరి పాట సూపర్ హిట్ కావడంతో ‘3’ సినిమాకి ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఆ చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.

Exit mobile version