ఫెమినా మ్యాగజైన్ వారు ఇండియా వ్యాప్తంగా అందగత్తెల లిస్ట్ తాయారు చేయగా శృతి హసన్ అందులో చోటు దక్కించుకుంది. ఫెమినా మ్యాగజైన్ వారు ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఇండియా నుండి 50 మంది అందగత్తెల లిస్ట్ తాయారు చేస్తారు. అందులో మొదటి చోటు దీపిక పడుకొనే దక్కించుకుంది. సౌత్ ఇండియా నుండి శృతి హసన్ ఎంపికయింది. వీరే కాకుండా జెనీలియా డిసౌజా, ఫ్రిదా పింటో, నర్గిస్ ఫఖ్రి, కల్కి కోచ్లిన్,అమృత పూరి, మోనికా డోగ్ర మరియు ప్రీతీ దేశాయ్ వీరు కూడా ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం శృతి హసన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్లో పాల్గొంటుంది.