కరీనా కపూర్ తో కలిసి నటించనున్న మరియం జకారియ

కరీనా కపూర్ తో కలిసి నటించనున్న మరియం జకారియ

Published on Feb 12, 2012 10:53 AM IST

ఇరానియన్ – స్వీడిష్ దేశ నటి అయిన మరియం జకారియ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 100% లవ్ చిత్రంలో ఐటెం సాంగ్ లో నర్తించింది. ఆ తరువాత అల్లరి నరేష్ నటించిన మడత కాజ చిత్రంలో సపోర్టింగ్ పాత్రలో నటించింది. ప్రస్తుతం రాజశేఖర్ సరసన ‘అర్జున’ చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా బాలీవుడ్లో ‘డిల్లి కి బిల్లి’ మరియు ‘సడ్డా అడ్డా’ చిత్రాల్లో కూడా ఐటెం సాంగ్స్ లో నర్తించడంతో బాగా పాపులర్ అయింది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ‘ఏజెంట్ వినోద్’ చిత్రంలో కరీనా కపూర్ పక్కన నర్తించే అవకాశం దక్కించుకుంది. ఇంత తక్కువ వ్యవధిలో బాలీవుడ్ వరకు వెళ్ళిన మరియం జకారియ ని అభినందించి తీరాలి. తెలుగులో కూడా సపోర్టింగ్ పాత్రలతో పాటు పలు ఐటెం సాంగ్స్ లో చేస్తుంది.

తాజా వార్తలు