27 నుండి పోరాటాలు చెయ్యనున్న మహేష్ బాబు

సుకుమార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న చిత్రంలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ కోసం సకలం సిద్దం చేశారు.ఈ నెల 27 నుండి మొదలు కాబోతున్న ఈ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సెట్ నిర్మించారు. ప్రస్తుతం మరో ఫ్లోర్ లో మహేష్ బాబు పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దేవి శ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు “దూకుడు”చిత్రం తరువాత 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ తో మహేష్ బాబు కలిసి పని చెయ్యటం మొదటి సారి కావడంతో చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version