ఎందుకంటే ప్రేమంట – కామెడి,రోమాన్స్,యాక్షన్ల సమ్మేళనం

దర్శకుడు కరుణాకరన్ తనదయిన శైలిలో చిత్రాలు తెరకెక్కించడంలో సిద్దహస్తుడు తెలుగు ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ దర్శకుడు తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట”. ఈ వేసవికి విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం కరుణాకరన్ చాలా కష్టపడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం చిత్రం యాక్షన్,కామెడి,రోమాన్స్ మరియు కరుణాకరన్ శైలి సన్నివేశాల సమ్మేళనంగా ఉండబోతుంది. రామ్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో రాబోతున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ మీద స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. జి.వి ప్రకాష్ అందించిన సంగీతం త్వరలో విడుదల కానుంది.

Exit mobile version