బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు. తను నటించిన ‘అగ్నిపధ్’ ఇటీవలే విడుదలై మొదటి రోజే 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం హృతిక్ కెరీర్లో భారీ చిత్రాల సరసన నిలవబోతుంది అంటున్నారు. సంజయ్ దత్ మరియు హృతిక్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహారాష్ట్ర మరియు బీహార్ లలో కలెక్షన్లు బాగా వసూలు చేస్తుంది. ఇది ఇలాగే సాగితే 100 కోట్ల మార్కును చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.