రామ్ మరియు తమన్నా జంటగా నటిస్తున్న ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి సంభందించిన ప్రత్యేక సమాచారం మాకు లభించింది. మొదటగా ఈ ఆడియోని ఈ నెల 21న నిర్వహించాలని అనుకున్నారు. పలు కారణాల వాళ్ళ ఈ ఆడియో విడుదల వేడుకని ఈ నెల 29కి వాయిదా వేసారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ వేడుకని అన్నపూర్ణ స్టుడియోలో నిర్వహించనున్నారు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు.