నాగార్జున గారి భార్య అమల అక్కినేని తన అవయవాలను దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసారు. జనవరి 26న ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఈ ప్రతిజ్ఞ చేసారు. అరవింద్ కృష్ణ నటించిన “రుషి” చిత్ర ప్రచారం ఓ భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అవయవ దానం మీద అవగాహన ఉద్దేశంగా ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి అమల ముఖ్య అతిధి గ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో అమల మాట్లాడుతూ ” చాలా మంది మనం ఒకేసారి బతుకుతం ఒకేసారి చనిపోతం అని నమ్ముతుంటారు ఇలాంటి కార్ర్యక్రమం లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. అరవింద్ కృష్ణ, రాజ్ ముదిరాజ్ మరియు రమేష్ ప్రసాద్ లు కూడా అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు.