నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!

Mirai

యంగ్ టాలెంటెడ్ హీరో మన టాలీవుడ్ క సూపర్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన మరో విజువల్ యాక్షన్ ట్రీట్ చిత్రమే “మిరాయ్”. హను మాన్ తర్వాత మళ్ళీ అదే తరహా సాలిడ్ కాన్సెప్ట్ తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా మంచి అంచనాలు నడుమ వచ్చి వాటిని అందుకుంది.

మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ విషయంలో ఆసక్తికర వాతావరణమే నెలకొంది అని చెప్పాలి. దీనితో మిరాయ్ సినిమా దాదాపు అన్ని చోట్ల సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకోగా హిందీ వెర్షన్ పై కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇలా హను మాన్ ఏ విధంగా అదరగొట్టిందో ఇపుడు మిరాయ్ కి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ దక్కినట్టు అక్కడి ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

హను మాన్ చిత్రానికి 2 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వస్తే మిరాయ్ కి ఇంచుమించు ఆ మేరనే రావడం విశేషం. మిరాయ్ సినిమా అక్కడ 1.7 కోట్ల నెట్ వసూళ్లతో ఒక మంచి ఆరంభాన్ని అందుకుంది. దీనితో మిరాయ్ కి ముందు రోజుల్లో మరింత బెటర్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.

Exit mobile version