చరణ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్.!

అభిమానం ఎల్లలు దాటిన వేళ తమ హీరోల కోసం ఫ్యాన్స్ ఎంత దూరం అయినా వెళ్తారు. వారి అభిమాన హీరోల ఆనందంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. అభిమానులు ప్రతీ ఒక్క స్టార్ హీరోకూ ఉన్నట్టుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు అలా చరణ్ పై చేసిన ఓ ఫ్యాన్ మేడ్ ఎడిట్ నే..సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో అటెన్షన్ తెచ్చుకుని మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ను అందుకుంది.

ప్రస్తుతం చరణ్ రాజమౌళితో “RRR” మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మరియు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హెర్గ నటిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”లో ఒక కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఆ రోల్ కు సంబంధించే ఒక పోస్టర్ ను డిజైన్ చేసి ఓ అభిమాని వదిలాడు. దానికి ఒక్కసారిగా భారీ రెస్పాన్స్ వచ్చింది.

చాలా రియలిస్టిక్ గా ఉన్న ఈ పోస్టర్ ను ఎవరైనా చూస్తే ఆఫీసియల్ పోస్టర్ అనే అనుకుంటారు, ఆ టైప్ లో ఉంది మరి. దీనితో ఒక పక్క అభిమానులు కూడా గట్టిగా షేర్ చేసుకుంటున్నారు. అలాగే “ఆచార్య” హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతూ వస్తుంది. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version