ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను కూడా చిరు లైన్ లో పెట్టారు.
కానీ ఈ ఏడాది లాక్ డౌన్ మూలన ఆచార్య సినిమానే చాలా వాయిదా పడిపోయింది. మొత్తానికి మాత్రం చాలా అడ్డంకుల అనంతరం మెగాస్టార్ మళ్ళీ ఆచార్య షూట్ కోసం ప్రిపేర్ అవ్వడానికి రెడీ అయ్యారు. దీనితో మళ్ళీ తన మేకోవర్ ను చేంజ్ చేసి సోషల్ మీడియా ప్రజానీకాన్ని స్టన్ చేస్తున్నారు.
ఆ మధ్య గుండు లుక్ లో షాకిచ్చిన బాస్ ఇపుడు ఒక ఫ్రెష్ లో సూట్ లో కనిపించి మళ్ళీ కెమెరా ముందు రెడీ అన్నట్టుగా మారిపోయారు. టాలెంటెడ్ నటుడు వైవా హర్షతో కలిసి ఉన్న ఒక సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు మెగా ఫ్యాన్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇందులో చిరు లుక్ చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.