మెగా ఫ్యాన్స్‌ను టెన్షన్ పడేలా చేస్తున్న ‘థగ్ లైఫ్’.. కారణం ఇదే!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘థగ్ లైఫ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే, ఈ సినిమాను చూసిన మెగా ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్ అని తెలుస్తోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పెద్ది’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఇదే మెగా ఫ్యాన్స్‌ను టెన్షన్ పడేలా చేస్తోంది.

థగ్ లైఫ్ మూవీకి ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు నీరసం తెప్పించేలా ఉంది. సాంగ్స్ ఆకట్టుకోకపోయినా, కనీసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయినా బాగుండాలి. కానీ, ‘థగ్ లైఫ్’లో ఈ రెండు నీరసం తెప్పించేలా ఉండటమే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. పెద్ది సినిమాకు సంగీతం విషయంలో ఎలాంటి తేడా జరిగినా అది సినిమా పై ప్రభావం చూపిస్తుందని వారు భావిస్తున్నారు. మరి వారి ఆందోళనకు ఏఆర్ రెహమాన్ ఎలాంటి మ్యూజిక్‌తో సమాధానం చెబుతాడో చూడాలి.

Exit mobile version