మునుపటితరం నటి మీనా టాలీవుడ్ లో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. దాదాపు అప్పటితరం అగ్రనాయకులందరితో నటించిన ఈ భామ పెళ్లి తరువాత రెండేళ్ళ నుంచి సినీరంగానికి దూరంగావుంటుంది. ఇటీవలే ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో తళుక్కున మెరిసింది. దాదాపు నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్న మీనా పేరు దక్షిణాదిన తెలియనివారుండరు.
తాజా సమాచారం ప్రకారం మీనా మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి తల్లి పాత్రలో నటించనుంది. విశేషం ఏమిటంటే మమ్ముట్టి వయసు 60, మీనా వయసు 40. అంటే ఆమె వయసుకి మించిన చేయ్యనుందన్నమాట. ఇటువంటి ప్రొయోగమే టాలీవుడ్ లో కూడా చేస్తుందేమో చూడాలి.