భోజ్ పూరి లో రీమేక్ కానున్న “మాతృ దేవో భవ”

భోజ్ పూరి లో రీమేక్ కానున్న “మాతృ దేవో భవ”

Published on Aug 4, 2012 3:51 AM IST


తెలుగులో ఎప్పటికి నిలిచిపోయే మెలోడ్రామ చిత్రాలలో ఒకటి “మాతృ దేవో భవ”, మాధవి మరియు నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం భోజ్ పూరి భాషలో తెరకెక్కిస్తున్నారు. 1993లో విడుదలయిన ఈ చిత్రం ఇపటికి చూసిన వారి చేత కన్నీరు పెట్టిస్తుంది. కే అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కే ఎస్ రామ రావు నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని భోజ్ పూరిలో జయప్రద మరియు మనోజ్ తివారి ప్రధాన పాత్రలలో తెరకెక్కించనున్నారు. దిన్కర్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ఈ రీమేక్ కి జయప్రద నిర్మాత వ్యవహరించనున్నారు. జయప్రద మరిన్ని చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నారని బాలివుడ్ సమాచారం. ప్రస్తుతం “మాతృ దేవో భవ” చిత్రం మీదే జయప్రద నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు.

తాజా వార్తలు