రెండు రోజుల్లోనే టార్గెట్ కొట్టేసిన “మాస్టర్”..వసూళ్లు ఇవే.!

రెండు రోజుల్లోనే టార్గెట్ కొట్టేసిన “మాస్టర్”..వసూళ్లు ఇవే.!

Published on Jan 15, 2021 10:00 AM IST

థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్టర్”. మోస్ట్ అవైటెడ్ చిత్రంగా భారీ ఎత్తున విడుదల కాబడింది. అన్ని భాషల్లో కూడా సాలిడ్ విడుదల కాబడి భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది.

మరి దీనితో పాటుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మాస్టర్ విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ మరియు ఓపెనింగ్స్ ను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. అయితే మొదటి రోజే 80 శాతం వసూళ్లను రాబట్టేసిన ఈ చిత్రం ఇప్పుడు రెండో రోజు వసూళ్లతో ఒక రెండు ఏరియాలు మినహా మొత్తం అన్ని చోట్లా టార్గెట్ ను కొట్టేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి పీఆర్ లెక్కల ప్రకారం ఈ చిత్రం రెండో రోజు 1.62 కోట్లు షేర్ రాబట్టింది. ఇక మరి ఏరియాల వారీగా డే 2 మాస్టర్ వసూళ్లను చూస్తే..

నైజాం – 44 లక్షలు
సీడెడ్ – 35 లక్షలు
వైజాగ్ – 21 లక్షలు
గుంటూరు – 14 లక్షలు
తూర్పు – 11.5 లక్షలు
పశ్చిమ – 13.5 లక్షలు
కృష్ణ – 15 లక్షలు
నెల్లూరు – 7.5 లక్షలు
మొత్తం – 1.62 కోట్లు ను రాబట్టింది.

అయితే ఇందులో ఇంకా సీడెడ్ మరియు కృష్ణా ప్రాంతాల్లో తప్ప అన్ని చోట్లా బ్రేకీవెన్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రెండు చోట్ల కూడా ఈ మూడో రోజుతో టార్గెట్ రీచ్ అయ్యిపోవచ్చు.

తాజా వార్తలు