తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. కాగా విజయ్ నుండి వస్తోన్న ఈ కొత్త సినిమా ఈ నెల 13న సినిమా భారీ ఎత్తున విడుదలకానుంది. తెలుగులో కూడ ‘మాస్టర్’ పేరుతో రిలీజవుతుంది. కాగా ప్రేక్షకుల్లో సినిమా మీద తారాస్థాయి అంచనాలున్నాయి. విజయ్ అభిమానులైతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందట. అద్భుతమైన ఎమోషన్స్ తో ఈ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది.
ఇక విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘మాస్టర్’ మరి ఎలా ఉంటుందో చూడాలి. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. విజయ్ గత సినిమా ‘బిగిల్’ కంటే కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా హడావుడి స్టార్ట్ చేసారు.