భారీ ఎత్తున జరగనున్న సూర్య మూవీ ఆడియో వేడుక

భారీ ఎత్తున జరగనున్న సూర్య మూవీ ఆడియో వేడుక

Published on Aug 5, 2012 4:41 AM IST


తమిళ హీరో సూర్య అవిభక్త కవలలుగా నటిస్తున్న ‘మాట్రాన్’ చిత్ర ఆడియోని చాలా గ్రాండ్ గా లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్ర ఆడియో వేడుక ఆగష్టు 9న సింగపూర్ లో జరగనుంది మరియు ఈ మధ్య కాలంలో తమిళంలో ఏ చిత్రం జరగనంత గొప్పగా ఈ చిత్ర ఆడియో వేడుకను జరపనున్నారు. ఈ చిత్ర దర్శకుడు కె.వి ఆనంద్ ఇప్పటికే తనకి తెలిసిన పరిశ్రమ పెద్దలను ఈ వేడుకకు ఆహ్వానించారు మరియు హీరో సూర్య కూడా ఇప్పటి వరకూ తనతో నటించిన అందాల భామలు అసిన్, త్రిష, నయనతార, అనుష్క, తమన్నా, దివ్య స్పందన, సమీర రెడ్డి మరియు శ్రుతి హసన్ లను ఆహ్వానించారు. అలాగే ఈ వేడుకలో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి ఈ వేడుకకు హాజరు కానున్నారు.

ఈ చిత్రంలో సూర్య సుమారు 2500 షాట్స్ లో నటించి సరికొత్త రికార్డును సృష్టించారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇరిన మలీవ మరియు జూలియా బ్లిస్ అనే ఇద్దరు రష్యన్ భామలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి హారీష్ జైరాజ్ సంగీతం అందిస్తునారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘డూప్లికేట్’ గా అనువాదం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన తెలుగు చిత్ర హక్కుల్ని బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం చెన్నై, హైదరాబాద్, రష్యా మరియు ఈస్ట్ యురోపియన్ దేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సనాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు