దుమ్ము లేపిన మాస్ మహారాజ్..మిగతా వాళ్ళకి గట్టి బూస్టప్ నే ఇచ్చారు.!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తమ హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ మసాలా ఎంటెర్టైనెర్ చిత్రం “క్రాక్”. రవితేజ కెరీర్ లోనే మంచి మోస్ట్ అవైటెడ్ చిత్రంగా చివరి నిమిషంలో ఊహించని అడ్డంకితో ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదలయ్యి దుమ్ము లేపే టాక్ ను తీసుకు వచ్చుకుంది.

అయితే ఈ చిత్రం కోసం థియేటర్స్ కు తరలి వచ్చిన జన సమూహం వల్లే ఇప్పుడు రానున్న సినిమాల పై నెలకొన్న అనుమానాలకు తెర దించేసింది. అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఓ సినిమా వస్తే అదిరిపోయే వెల్కమ్ దక్కుతుందా లేదా అన్న సంశయంలో మాస్ మహారాజ్ కు కాస్త లేట్ అయినా సాలిడ్ వెల్కమ్ ను తెలుగు ప్రేక్షకులు అందించారు.

అయితే అది రవితేజపై ఉన్న ప్రేమ గౌరవం అయినప్పటికీ ఓ సినిమా కోసం అంతలా ఎదురు చూసారు అంటే ఇక ముందు రాబోయే సినిమాలకు కూడా ఖచ్చితంగా మంచి ఆదరణ ఉంటుంది అని ఒకరకమైన భరోసా వచ్చింది. దీనితో మాస్ మహారాజ్ సినిమా మిగతా సినిమాలకు గట్టి బూస్టప్ నే ఇచ్చినట్టు అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version