మారుతి నిర్మాణంలో ఫీల్ గుడ్ మూవీ

మారుతి నిర్మాణంలో ఫీల్ గుడ్ మూవీ

Published on Aug 21, 2013 6:16 PM IST

Lovers Posters (3)
‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాల దర్శకుడు మారుతి దర్శకుడిగానే కాకుండా మారుతీ టాకీస్ సమర్పణలో సినిమాలు కూడా చేస్తున్నాడు. మారుతి టాకీస్ సమర్పణలో మాయాబజార్ మూవీస్ సంస్థతో కలిసి ‘లవర్స్’ అనే సినిమాని తీయనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి.

సుమంత్ అశ్విన్ – నందిత జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా హరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ ‘ ఈ సినిమాకి నేనొక నిర్మాతని మాత్రమే, స్క్రిప్ట్ – దర్శకత్వంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. హరి 9 నెలలు కష్టపడి కథని చాలా బాగా రాసుకున్నాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. సుమంత్ అశ్విన్ – నందిత సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోతారు. ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 నుంచి మొదలవుతుందని’ అన్నాడు.

తాజా వార్తలు