సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం తీసిన ‘బొంబాయి’ సినిమా ద్వారా మనీషా కొయిరాల సౌత్ ఇండియాకి పరిచయమయ్యింది. నిన్న రాత్రి ఉన్నట్టుండి మనీషా కోయిరాల తన ఇంట్లో స్పృహ తప్పి పడిపోగా తనని ముంబైలోని జస్లాక్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమె బాగా బలహీనంగా ఉందని మరియు బాగా ఒత్తిడికి గురైందని తెలిపారు. మనీషా 2010లో సామ్రాట్ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మనీషా గత కొద్ది రోజులుగా తన భర్తకి దూరంగా ముంబైలో ఉంటోంది. ఇటీవలే రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘భూత్ రిటర్న్స్’ సినిమా ద్వారా మనీషా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.