
మణిరత్నం దర్శకత్వంలో రానున్న చిత్రం ” కడలి” చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ ఏడాది మొదలయిన ఈ చిత్రం కోసం మణిరత్నం తమిళనాడు మరియు అండమాన్ నికోబార్ దీవులలో పలు అందమయిన ప్రదేశాలలో చిత్రీకరణ జరిపారు అంతే కాకుండా చాలా క్లిష్టమయిన వాతావరణంలో కూడా చిత్రీకరణ ఆపకుండా జరిపారు. ఈ మధ్యనే ఈ చిత్ర క్లైమాక్స్ ని నీలం తుఫానుకి ప్రభావితం అయిన ఉత్తర మద్రాస్ లో చిత్రీకరణ జరిపారు. గౌతం మరియు తులసి ఈ చిత్రంతో తెరకు పరిచయం కానున్నారు. ఇప్పటికే తులసి తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి మరియు లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ “నేంజికుల్” అనే పాటను విడుదల చేసినప్పటి నుండి అందరు ఈ చిత్రం గురించే మాట్లాడుతున్నారు. రాజీవ్ మీనన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రం తమిళంలో “కడల్” అనే పేరుతో తెరకెక్కుతుంది.