తన ప్రతీ సినిమాలో కష్టమైన యాక్షన్ సన్నివేశాలను ఎంతో ఇష్టంగా చేసి తనని తాను ఆపదలో పడేసుకునే హీరోలలో మంచు మనోజ్ ఒకడు. ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో తగిలిన గాయం తరువాత కాస్త విరామం తీసుకుని తిరిగి షూటింగ్ లో పాల్గున్న మనోజ్ ఇప్పుడు మెడ నొప్పితో బాధపడుతున్నాడు.’పోటుగాడు’ సినిమా షూటింగ్లో గాయపడిన తనని కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోమన్నారు. తను తిరిగి జూలై 25 నుండి షూటింగ్లో పాల్గుంటాడని స్వయంగా మనోజే తెలిపాడు. ‘పోటుగాడు’ సినిమా మాత్రమే కాకుండా మనోజ్ మంచు వారి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ‘పోటుగాడు’ సినిమా ప్రచారం కోసం తమిళ నటుడు శింబు పాడిన ‘బుజ్జి పిల్లా’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేసారు. దీనికి ఇంటర్నెట్లో మంచి స్పందన వచ్చింది. పవన్ వాడేయార్ ఈ సినిమాకు దర్శకుడు. శిరీష-శ్రీధర్ నిర్మాతలు. అచ్చు – చక్రీ సంగీతాన్ని అందించారు. ఆగష్టులో ఈ సినిమా విడుదలకానుంది.
ఈ సినిమాలేకాక మరో కొన్ని స్క్రిప్ట్‌లను వింటున్న మనోజ్ త్వరలో మరిన్ని ప్రాజెక్ట్‌లను అంగీకరించే అవకాశం వుంది.